భారత్ ముందు భారీ విజయ లక్ష్యం 316

వెస్టిండీస్, ఇండియాల మధ్య జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్ టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన విండీస్.. భారత్ ముందు భారీ లక్ష్యం ఉంచింది. తొలి వికెట్ ఓపెనర్లు ఎవిన్ లూయిస్, షై హోప్ అర్ధసెంచరీ(57) భాగస్వామ్యం నమోదు చేశారు. లూయిస్ జడేజా ఔట్ చేసిన అనంతరం రోస్టన్ చేజ్ క్రీజులోకి వచ్చాడు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ.. స్కోరుబోర్డును నడిపించారు. మంచి ఫామ్ ఉన్న హోప్ షమీ క్లీన్ చేశాడు. అనంతరం హెట్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో దూకుడు మీదున్న క్రమంలో నవదీప్ సైనీ బౌలింగ్ భారీ షాట్ ఆడబోయి, కుల్దీప్ చిక్కాడు. స్వల్పవ్యవధిలోనే హెట్ చేజ్ ఔటయ్యేసరికి విండీస్ ఒత్తిడిలో పడింది. కానీ, ఆ ఒత్తిడి ఎంతో సేపు నిలవనివ్వలేదు పూరన్-పొలార్డ్ జోడీ. పూరన్ మొదట్నుంచే దూకుడు ప్రదర్శించాడు.

64 బంతులెదుర్కొన్న నికోలస్ పూరన్ 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం కెప్టెన్ పొలార్డ్ భారత బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 51 బంతుల్లో 74 పరుగులు చేసిన పొలార్డ్ ఏకంగా 7 సిక్సర్లు, 3 ఫోర్లు బాదాడు. 50 ఓవర్లు బ్యాటింగ్ చేసిన విండీస్ 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఒకానొక దశలో 250 మార్క్ కూడా దాటదనుకున్న విండీస్ స్కోరు 300 దాటింది. దీనికి నికోలస్ పూరన్, కెప్టెన్ పొలార్డ్ హిట్టింగే కారణం. భారత ఫీల్డర్ల వైఫల్యం కూడా వారికి కలిసొచ్చింది. భారత బౌలర్లలో నవదీప్ సైనీ 2 వికెట్లు పడగొట్టగా.. షార్దూల్, షమీ, జడేజా తలో వికెట్ తీశారు.