
నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను నేరుగా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ప్రకటించారు. విద్యాహక్కు చట్టం ప్రకారం వారిని పై తరగతులకు పంపిస్తున్నామని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అయితే విద్యార్థుల పేరెంట్స్కు ప్రతిరోజు ఒక యాక్టివిటీ లేదా ప్రాజెక్ట్ను ఎస్ఎంఎస్ ద్వారా, రికార్డెడ్ ఫోన్ కాల్స్ ద్వారా పంపిస్తామని వెల్లడించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లను మార్చి 12న మూసివేసిన విషయం తెలిసిందే.