
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు తమ వంతుగా విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకొస్తున్నారు. తెలంగాణ రైస్ మిల్ అసోసియేషన్ 50 లక్షల రూపాయల చెక్కును సీఎం సహాయనిధికి అందజేసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ కు అసోసియేషన్ సభ్యులు చెక్కును అందజేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భాష్యం స్కూల్స్ విద్యాసంస్థల ప్రతినిధులు సుధాకర్ రెడ్డి, చైతన్య సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 25 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను కలిసి విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ తరపున చెక్కును అందించారు.