
తెలంగాణలోనూ క్రమక్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవ్వాళ రాష్ట్రంలో కొత్తగా ఆరు కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 76కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కరోనా నుంచి 14 మంది బాధితులు కోలుకున్నారు. కోలుకున్నవారిని ఇవ్వాళ ఒక్కరోజే 13 మంది డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా కరోనాతో మరొకరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరనాతో ఇద్దరు మరణించారు. ఇక 14మంది బాధితుల్లో ఇదివరకే ఒకరు డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం రాష్ట్రంలో 61మంది కరోనా పాజిటివ్ బాధితులు ఉన్నారు.