
నిజావద్ధీన్ మర్కజ్ లో ప్రార్థనల్లో కొందరికీ కరోనా పాజిటివ్ గా తెలిన్నట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మార్చి 13వ తేదీ నుంచి 15 వరకు నిజావద్ధీన్ మర్కజ్ లో ప్రార్థనలు జరిగాయి. పాజిటివ్ తేలిన వారిలో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నాట్టు సమాచారం. ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందగా.. నిజామాబాద్ లో ఒకరు, గద్వాలలో మరోకరు మృతి చెందినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వీరి ద్వారా వైరస్ వ్యాప్తి అవకాశం ఉందని అనుమానితులను గుర్తిస్తున్నట్లు వారు తెలిపారు.
కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు అనుమానితులను పరీక్షలకు తరలిస్తున్నాయి. మర్కజ్ ప్రార్థనల్లో వారంతా అధికారులకు సమాచారం అందించామని, ప్రార్థనల్లో పాల్గొన్న వారికి ఉచితంగా చికిత్స అందిస్తామని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇతర రాష్ట్రాల సరిహద్దులో చిక్కుకున్న పాచ్చతండా వాసులు మంత్రి జగదీష్ రెడ్డి చొరవతో స్వరాష్ట్రంలోకి చేరుకున్న తండా వాసులు, ప్రాథమిక చికిత్స అనంతరం రాష్ట్రంలోకి ప్రవేశించినందుకు పాచ్చతంగా వాసులు మంత్రి జగదీష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.