
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ వైరస్ బారిన పడి 37,820 మందికి పైగా మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా 7,85,807 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,65,659 మంది కోలుకున్నారు.
యూఎస్‌లో 1,64,253 కేసులు(3,167 మంది మృతి), ఇటలీలో 1,01739 కేసులు(మృతులు 11,591), స్పెయిన్‌లో 87,956 కేసులు(మృతులు 7716), జర్మనీలో 66,885 కేసులు(మృతులు 645), ఫ్రాన్స్‌లో 44550 కేసులు(మృతులు 3024), ఇరాన్లో 41,495 కేసులు(మృతులు 2,757), యూకేలో 22,141 కేసులు(1408 మృతులు), స్విట్జర్లాండ్‌లో 15,992 కేసులు(మృతులు 359), నెదర్లాండ్స్‌లో 11,750 కేసులు(మృతులు 864), బెల్జియంలో 11,899 కేసులు(613 మృతులు), దక్షిణ కొరియాలో 9,786 కేసులు(మృతులు 162), టర్కీలో 10,827 కేసులు(మృతులు 168) నమోదు అయ్యాయి.