
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతమున్న కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు 43 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ట్లు ప్రభుత్వం పేర్కొన్నది. మొత్తం 373 శాంపిల్స్ (నమూనా)కు పరీక్షలు నిర్వహించగా..330 నెగిటివ్, 43 పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 87 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
వీటిలో పశ్చిమగోదావరి జిల్లాలో 13 మందికి కరోనా సోకినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ తెలిపింది. చిత్తూరు జిల్లాలో ఇవాళ 5 కరోనా కేసులు, ప్రకాశం జిల్లాలో 4 కరోనా కేసులు, నెల్లూరు జిల్లాలో 2 కరోనా కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 2 కరోనా కేసులు, విశాఖ, కృష్ణా జిల్లాల్లో ఒక్కో కేసు నమోదవగా, విశాఖ జిల్లాలో మొత్తం 11 కు కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొంది.