తెలంగాణలో కరోనా 97… ఆంధ్రప్రదేశ్ లో కరోనా 87

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దేశ ప్రధానులు మొదలు సామాన్య జనాల వరకు కరోనా బారినపడుతున్నారు. రోజు రోజుకు కరోనా రోగుల సంఖ్య పెరుగుతునే ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 8,60,696 మందికి సోకగా 42,352 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 1,78,537 మంది కోలుకున్నారు. ఒక్క అమెరికాలో కరోనా సోకిన వారి సంఖ్య 1,88,592 మందికి చేరుకుంది. కరోనాతో ఇటలీలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ఒక్క ఇటలీ దేశంలో కరోనాతో 12,428 మృతి చెందారు. భారత్ దేశంలో కరోనా రోగులు సంఖ్య 1750కి చేరుకుంది. కరోనాలో భారత్‌లో ఇప్పటి వరకు 53 మంది చనిపోయారు. తెలంగాణ కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య 97, ఎపిలో 87కు చేరుకుంది. కరోనా వ్యాధితో తెలంగాణ ఆరుగురు మరణించారు. భారత్ లో దేశంలో కరోనా రోగుల సంఖ్య మహారాష్ట్ర(325) తొలిస్థానంలో ఉంది.