
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించాడానికి విశేష కృషి చేస్తున్న వైద్య, పోలీస్ సిబ్బందికి మార్చి నెల పూర్తి వేతనం చెల్లించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. వీరి సేవలకు గుర్తింపుగా అదనపు నగదు ప్రోత్సాహం కూడా అందించాలని సిఎం నిర్ణయం తీసుకున్నారు. ఇన్సెంటివ్ ను రేపో మాపో ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో కరోనా వ్యాప్తిని నివారించడానికి సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటుందని, లాక్ డౌన్ ను ప్రజలు విజయవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంతి కేసీఆర్ ప్రజలను పిలుపునిచ్చారు.
మరికొద్ది రోజులు ప్రజలు సహకరిస్తే రాష్ట్రంలో కరోనా వైరస్ అరికట్టవచ్చని తెలిపారు. ఢిల్లీ వెళ్లివచ్చిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. కరోనా బాధితులకు వైద్యం చేస్తున్న సిబ్బంది భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధన్యం ఇస్తుందన్నారు. వైద్య సిబ్బందికి కావాల్సిన పిపిఇ కిట్లు, ఎన్ 95 మాస్కులు సిద్ధం చేశామన్నారు. వైద్య సిబ్బంది కోసం హైడ్రాక్సి క్లోరోక్విన్, అజిత్రో మైసిన్ ట్యాబ్లెట్లు సిద్ధం. వైద్య పరీక్షలు చేేసేందుకు అవసరమైన మెడికల్ కిట్స్ సిద్ధంగా ఉంచామని సీఎం కేసీఆర్ తెలపారు.