సీఎం కేసీఆర్‌ శ్రీరామనవమి శుభాకాంక్షలు

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని భగవంతుడ్ని సీఎం కేసీఆర్‌ ప్రార్థించారు. కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. భద్రాద్రిలో కేవలం ఆలయ అర్చకులు మాత్రమే నవమి వేడుకలను నిర్వహిస్తున్నారు. రాములోరి కల్యాణానికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పట్టు వస్ర్తాలు సమర్పించారు.