ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 143కు చేరాయి. మొత్తం 123 మంది అనుమానితులకు నమూనాలు పరీక్షించగా 112 మంది ఫలితాలు నెగెటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ రోజు కృష్ణా జిల్లాలో కొత్తగా 8 కేసులు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదైంది.