ఆంధప్రదేశ్‌లో తొలి క‌రోనా మ‌ర‌ణం

ఆంధప్రదేశ్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. ఇదే విష‌యాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. విజయవాడలోని భవానీపురంలో ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్ రావడం కలకలం రేపగా.. తొలి కరోనా మరణం కూడా అక్కడే సంభవించింది. విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ జమాతే సభకు వెళ్లి రాగా.. ఆ వ్యక్తి తండ్రి కరోనాతో చనిపోయాడు. మరణానంతరం పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. కాగా అటు ఏపీలో క‌రోనా సోకిన వారి సంఖ్య వేగంగా పెరుగుతుంది. మ‌ర్క‌జ్ ఘ‌ట‌న త‌ర్వాత ఏపీలో భారీగా క‌రోనా బాధితుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతుంది. ఇక ఏపీలో నిన్న ఒక్కరోజే కొత్తగా 38 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 149కి చేరింది.