
లాక్డౌన్ సమయంలో ఇంట్లో అదేపనిగా కూర్చుని ఉంటే కూడా మంచింది కాదు. అందుకే అవకాశమున్నవారు లాక్డౌన్ సమయాన్ని అనుకూలంగా మార్చుకోవాలి. అవకాశముంటే మొక్కలు పెంచుకోవాలి. వాటికి కావలసిన ఎరువు ఇంట్లోనే తయారు చేసుకోవాలి. బయటకు వెళ్లేందుకు వీలుకాదు కాబట్టి ఇంట్లో ఉండే చెత్తతోనే ఎరువు తయారు చేసుకోవచ్చు. అసలే చెత్తబండి సరిగా రానిరోజులు. ఇదే ఎరువుకు సరైన సమయం. ఎరువు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం : – ముందుగా అట్టముక్కలతో చేసిన చెత్తబుట్టను తీసుకోవాలి. దానిపై న్యూస్ పేపర్ పరచాలి. ఇది కాకుండా ప్లాస్టిక్ బుట్ట అయితే దానికి చిన్న రంధ్రాలు వేయాలి. – ఇందులో మిగిలిపోయిన ఆహారం, చేప ముల్లులు, పెరుగు, కోడి గుడ్డు పెంకులు, ఎండిపోయిన ఆకులు, కాగితాలు, కాఫీ ఫిల్టర్, చికెన్ ముక్కలు, బటర్, బొగ్గు, పిచ్చిమొక్కలు, పేడ వీటన్నింటి వేయొచ్చు. – ఎండుటాకులు, చిన్న కాగితాలు, ఎండుపుల్లలను మొదటి లేయర్‌గా వేయాలి. ఇవి తేమను పీల్చుకుంటాయి. – కాఫీ ఫిల్టర్, కూరగాయల తొక్కలు, కిచెన్ వేస్ట్‌ని రెండవ లేయగా వేస్తూ కంటైనర్‌ను నింపేయాలి. – పులిసిన మజ్జిగ వేయడం వల్ల మైక్రోఆర్గానిజమ్స్ పెరుగుదలకు ఉపయోగపడుతాయి. – దీనిని ఐదువారాల పాటు పక్కన పెట్టాలి. తర్వాత తీసి చూస్తే ఎరువు తయారై ఉంటుంది.