వైద్యారోగ్య, పోలీసు శాఖల ఉద్యోగులకు పూర్తి వేతనాలు

రాష్ట్రంలో కరోనాపై యుద్ధం చేస్తున్న వైద్యారోగ్య, పోలీసు శాఖల ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. మార్చి నెలకు సంబంధించి వైద్యారోగ్య, పోలీసు శాఖల ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. వైద్యారోగ్య, పోలీసు శాఖల ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజాప్రతినిధులు, పలు శాఖల ఉద్యోగుల వేతనాల్లో ప్రభుత్వం కోత విధించిన విషయం విదితమే.