ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సేవలను ఎస్మా పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ సేవలను ఆరు నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ తాజాగా జీవో విడుదల చేసింది. పనిచేయడానికి నిరాకరించినవారిని శిక్షించే అధికారం ఉంటుందని జీవోలో పేర్కొంది. వైద్య పరికరాలు, మందుల కొనుగోలు, నిర్వహణ, రవాణా సిబ్బంది, వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య సేవల్లోని పారిశుద్ధ్య సిబ్బంది, అంబులెన్స్‌ సర్వీసులు ఎస్మా పరిధిలోకి తీసుకొచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది.