
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల పాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి 25 వరకూ ఆయన జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మొదటి రోజు స్టీల్ ప్లాంట్‌కు పునాది రాయి వేయనున్నారు. అలాగే పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, కడప, రాయచోటి ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు.