కరోనాపై పోరుకు సంఘీభావంగా దీపాలు వెలిగించండి – సీఎం కేసీఆర్‌

కరోనాపై పోరుకు సంఘీభావ సంకేతంగా ప్రజల ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 5 నెల రాత్రి 9 గంటలకు రాష్ట్ర ప్రజలంతా దీపాలు వెలిగించాలని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. మానవజాతి తనకు పట్టిన పీడపై చేస్తోన్న గొప్ప పోరాటం స్ఫూర్తివంతంగా సాగాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. కరోనాపై యుద్ధంలో భారతీయులంతా గెలుస్తారని ధీమా వ్యక్తం చేయడంతోపాటు మరోసారి దేశ పౌరులంతా కరోనాను తరిమికొట్టేందుకు ఈ ఆదివారం ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.