
భారత్‌లో కోవిడ్19 పాజిటివ్ కేసుల సంఖ్య 2902కు చేరుకున్నది. వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 68కి చేరుకున్న కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే వైరస్ సంక్రమించినవారిలో 2650 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు చెప్పింది. 183 మంది హాస్పటళ్ల నుంచి డిస్‌చార్జ్ అయ్యారు. తాజాగా కర్నాటక, రాజస్థాన్‌లో ఒక్కొక్కరు మృతిచెందారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో 36 ఏళ్ల వ్యక్తి కోవిడ్19 వ్యాధితో మృతిచెందాడు. దీంతో ఆ రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 9కి చేరుకున్నది. 155 పాజిటివ్ కేసులు ఉన్నాయి.
మహారాష్ట్రలో 2వ తేదీన చనిపోయిన వ్యక్తికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. లాక్‌డౌన్ ఆంక్షలను ధిక్కరించి.. మార్నిగ్ వాక్‌కు వెళ్లిన 41 మంది కొచ్చి పోలీసులు అరెస్టు చేశారు. తబ్లిగీ జమాత్ వెళ్లి వచ్చిన వారు తక్షణమే 104 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని, వారికి చికిత్సను అందిస్తామని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. ప్రభుత్వం మీకు పూర్తి అండగా ఉంటుందన్నారు.