ఫైనల్లో విండీస్ పై భారత్ అద్భుత విజయం

వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 316 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి 448.4 ఓవర్లలో విజయం అందుకుంది. విరాట్ కోహ్లీ 85 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా కేఎల్ రాహుల్ 77 పరుగులతో రాణించారు. ఆట చివర్లో జడేజా 39 పరుగులతో అద్భుతంగా ఆడి భారత్ కు విజయాన్ని అదించాడు. దీంతో 2-1 తేడాతో భారత్ సిరీస్ గెలుచుకుంది.