ఏపీలో 252కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌(కోవిడ్‌-19) విజృంభిస్తోంది.  రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 252కు చేరిందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇవాళ కొత్తగా 26 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇవాళ పెరిగిన కేసులన్నీ కర్నూలు జిల్లాలోనే నమోదయ్యాయి.  కర్నూలు జిల్లాలో   26 మందికి కోవిడ్‌-19 సోకినట్లు  తేలడంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 53కు చేరింది.  నిన్న రాత్రి 9గంటల నుంచి ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు  మొత్తం 60 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఐదుగురు పేషెంట్లు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.