
కరోనాపై పోరాటానికి సాయం చేసేందుకు బ్యాడ్మింటన్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముందుకొచ్చాడు. రూ.26లక్షలను విరాళంగా ప్రకటించాడు. రూ.11లక్షలను పీఎం-కేర్స్ నిధికి, రూ.10లక్షలను తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి, రూ.5లక్షలకు ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించినట్టు సోమవారం వెల్లడించాడు. కరోనాపై యుద్ధం చేస్తున్న ప్రభుత్వాలకు ఓ చిన్న సాయం చేస్తున్నానని గోపీచంద్ చెప్పాడు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో గొప్పగా పని చేస్తున్నాయని, మార్గనిర్దేశకాలను పాటిస్తూ ఇంట్లో ఉంటూ సహకరిద్దామని ప్రజలకు పిలుపునిచ్చాడు.