ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు 303.. సోమవారం ఒక్కరోజే 37

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కోరలు చాచింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొత్తగా 37 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు ఏపీ రాష్ట్ర నోడల్‌ అధికారి వెల్లడించారు. మొత్తంగా ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 303కు చేరుకుంది. సోమవారం నమోదైన 37 కేసుల్లో కర్నూల్‌లో 18, నెల్లూరులో 8, పశ్చిమ గోదావరిలో 5, కడపలో 4, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి. కృష్ణా జిల్లాలో ఒక రోగి రికవరీ అయి డిశ్చార్జి అయ్యాడు. ఈ వైరస్‌ నుంచి ఇప్పటి వరకు ఏపీలో కోలుకున్న వారి సంఖ్య 6. 

అనంతపూర్‌లో 6, చిత్తూరులో 17, తూర్పు గోదావరిలో 11, గుంటూరులో 32, కడపలో 27, కృష్ణాలో 29, కర్నూల్‌లో 74, నెల్లూరులో 42, ప్రకాశంలో 24, విశాఖపట్టణంలో 20, పశ్చిమ గోదావరిలో 21 కేసులు నమోదు అయ్యాయి.