ఆర్ధిక పరిస్థితి కంటే ప్రజలు బాగుండడం ముఖ్యం
రూ . 2400 కోట్ల ఆదాయం రావాల్సి ఉంటే రూ. 6 కోట్లు వచ్చింది
వైద్య సిబ్బంది , పోలీస్ , పారిశుధ్య కార్మికుల సేవకు చేతులు జోడించి మొక్కుతున్న
వైద్య సిబ్బంది , సిటీ , పట్టణ , గ్రామ పారిశుధ్య సిబ్బందికి సీఎం ప్రోత్సాహకం కింద కొంత మొత్తం అందజేత
కరోనా తో అమెరికా లాంటి దేశంలో శవాల గుట్టలు
పేద ప్రజలందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటం
ఇలాంటి సమయంలో దానం చేస్తున్న పేదల కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాలి
ప్రతి దానికి చిల్లరగా వ్యవహరించే కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి సమయంలో బాధ్యతగా చాలా భాద్యతగా వ్యవహరించాలి
ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్
వైద్య సిబ్బందికి చేతులెత్తి దండం పెడుతున్నా
కరోనా వైరస్ సోకిన రోగులను బాగు చేసేందుకు వైద్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తోందని సీఎం కేసీఆర్ కొనియాడారు. ప్రగతి భవన్‌లో కరోనా ప్రభావం, లాక్‌డౌన్ అమలుపై అత్యున్నత స్థాయి సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కరోనా యుద్ధంలో అందరికి మించి.. తమ ప్రాణాలకు తెగించి.. తమకు కూడా వైరస్ సోకోచ్చు అనే బాధ ఉండి.. వాటన్నింటిని పక్కన పెట్టి మన వైద్యులు అద్భుతమైన పని చేస్తున్నారు. హాస్పిటల్‌లో పని చేస్తున్న స్వీపర్ నుంచి మొదలుకొని డైరెక్టర్ వరకు వైద్య సిబ్బంది అందరికి.. రెండు చేతులెత్తి నా తరపున, రాష్ట్ర ప్రజల తరపున వారికి దండం పెడుతున్నా. పాదాభివందనం చేస్తున్నా అని సీఎం తెలిపారు. వాళ్ల ధైర్యం గొప్పది. వారు గొప్పవారు. డాక్టర్లు, నర్సులు, ఫార్మాసిస్టులకు ఎంత దండం పెట్టినా తక్కువే. వారి సమయాన్ని త్యాగం చేసి గొప్ప పని చేస్తున్నారు అని సీఎం పేర్కొన్నారు.
జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ సిబ్బందికి పూర్తి వేతనం
కరోనా నియంత్రణ చర్యల్లో విశ్రాంతి లేకుండా పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. ప్రగతి భవన్‌లో కరోనా ప్రభావం, లాక్‌డౌన్ అమలుపై అత్యున్నత స్థాయి సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు 95,392 మంది వరకు ఉంటారు. పారిశుద్ధ్య కార్మికుల జీతంలో విధించిన కోతను ఉపసంహరించుకుంటున్నామని సీఎం తెలిపారు. సీఎం ప్రోత్సాహం కింద మున్సిపల్ మున్సిపల్, గ్రామపంచాయతీ పారిశుద్ద్య కార్మికులకు రూ. 5 వేలు ఇస్తాం. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్ కార్యకర్తలకు రూ. 7,500 ఇస్తాం. డాక్టర్లు, వైద్య సిబ్బందికి జీతాలు పెంచి ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. పారిశుద్ధ్య పనులు బాగా కొనసాగిస్తే జబ్బు వ్యాప్తిని నియంత్రించొచ్చు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
నెల జీతం రూ.5వేలు..అందులో నుంచి రూ.1000 విరాళం
వాళ్ళు చిరుద్యోగులు, మాత్రమే పొందుతున్నారు. అయితేనేమీ.. అంతకంటే పెద్ద మనసున్నోళ్ళు… వారి జీతాల్లోంచి తలో ఇంత పోగేసి కోటి 72లక్షల 61వేల విరాళాన్ని సీఎం సహాయ నిధికి అందజేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో ఈ రోజు సాయంత్రం ఆ మొత్తానికి సంబంధించిన చెక్కుని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌కు ప్రగతి భవన్‌లో అందజేశారు.
కరోనా కట్టడి కోసం సీఎం సహాయ నిధికి అనేక మంది సహాయం అందిస్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని 17,261మంది ఐకెపి విఓఎలు మేమున్నామంటూ.. ముందుకు వచ్చారు. తమ నెల జీతం రూ.5వేల నుంచి ఒక్కొక్కరు ఒక్కో వెయ్యి రూపాయలను జమచేసి మొత్తం రూ. కోటి 72లక్షల 61వేలను ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో సోమవారం కేసీఆర్‌కు చెక్కు రూపంలో అందజేశారు.
ఐకెపి విఓఎలను, వాళ్ళని సమన్వయం చేసిన విఓఎల సంఘాన్ని, టిఆర్ ఎస్ కార్మిక విభాగాన్ని సీఎం కేసీఆర్, మంత్రి దయాకర్ రావులు అభినందించారు. సీఎంని కలిసిన వాళ్ళల్లో టీఆర్‌ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, తెలంగాణ ఐకెపి విఓఎల సంఘం గౌరవాధ్యక్షుడు ఎల్. రూప్ సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు మంచికట్ల కోటేశ్వర్, ప్రధాన కార్యదర్శి మారిపెల్లి మాధవి, కోశాధికారి పి.తిరుపతి తదితరులు ఉన్నారు.
లాక్‌డౌన్ మరో రెండు వారాలు పొడగించాల్సిందే
ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్‌డౌన్ ఎంత గట్టిగా పాటిస్తే అంత మంచిది అని సీఎం తెలిపారు. ఇండియాలో జూన్ 3 వరకు లాక్‌డౌన్ పాటించాలని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ చెప్పింది అని సీఎం గుర్తు చేశారు. మన దేశానికి లాక్‌డౌన్ తప్ప వేరే మార్గం లేదు అని ఆయన తేల్చిచెప్పారు. ఏప్రిల్ 15వ తేదీ తర్వాత లాక్ డౌన్ ను పొడిగించాలని ప్రధాని మోదీని కోరుతానని సీఎం పేర్కొన్నారు.
లాక్‌డౌన్ వల్ల ఆర్థికంగా నష్టపోక తప్పదు అని అన్నారు. మన రాష్ర్టానికి రోజుకు రూ. 400 నుంచి రూ. 430 కోట్ల ఆదాయం వస్తుంది. లాక్‌డౌన్ మూలంగా కేవలం రూ. 6 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు సీఎం. ప్రజలను బతికించుకోవాలంటే లాక్‌డౌన్ తప్ప వేరే మార్గం లేదు. ఒక వేళ లాక్‌డౌన్ సడలిస్తే పరిస్థితి ఏంటి? అని సీఎం ప్రశ్నించారు. మళ్లీ గుంపులు గుంపులుగా రోడ్ల మీదకి వస్తే ఎవరు జవాబుదారీ అని సీఎం అడిగారు. లాక్‌డౌన్ సడలించడమంటే అంత ఆషామాషీ కాదు. ప్రధానితో రోజుకు రెండుసార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ను కొనసాగించాల్సిందేనని ప్రధానికి చెప్పాను.
ఇది ప్రపంచానికి వచ్చిన పీడ. ఒక్క కుటుంబానికో, జాతికో రాలేదు. 22 దేశాలు పూర్తిగా 100 శాతం లాక్‌డౌన్ చేశాయి. జపాన్, సింగపూర్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, కొలంబియా, అర్జెంటీనా, నేపాల్‌తో పాటు మరిన్ని దేశాలు మన పద్ధతిలోనే లాక్‌డౌన్ చేశాయి. మరో 90 దేశాలు పాక్షికంగా లాక్‌డౌన్ చేశారు. మన రాష్ట్రం మంచి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సమాజాన్ని బతికించుకున్నామంటే లాక్‌డౌన్, స్వీయ నియంత్రణ వల్లే అయిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ న్యూయార్క్‌ను చూస్తే శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. అలాంటి దుఖం ఎవరికి సంభవించకూడదు. మనమైతే ఆగమయ్యేవాళ్లం. లాక్‌డౌన్ వల్లనే పరిస్థితిని కంట్రోల్ చేశాం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ప్రగతి భవన్ @ సీఎం కేసీఆర్
*కొరొనా నివారణకు కేంద్రం సూచనలు- అంతర్జాతీయ ప్రమాణాలు ఫాలో అయ్యాము
*కరొనా నివారణకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ అయ్యాము
*ఇప్పటి వరకు 4314 మంది పాజిటివ్ కేసులు ఉంటే.. మరణాలు 122 మంది మాత్రమే
*ఇండియా కొరొనా నివారణకు డిపరెంట్ ప్రభుత్వాలు ఉన్నా కట్టడి చేశామని ప్రపంచం చెప్తుంది
*ఇండియాలో సరైన వైద్య సదుపాయాలు-పరికరాలు లేవు
*అమెరికా-ఇటలీ లో ట్రక్స్ ద్వారా శవాలను తరలిస్తున్నాయి
*తెలంగాణ లో మొదటి పేజ్ విదేశాల నుంచి వచ్చిన వారు 25 వేల 937మందిని క్వరంటాయిన్ పెట్టాము…
* ఇందులో 55 మందికి కొరొనా వచ్చింది.
* 35 మంది ఇప్పటికి డిచార్జ్ అయ్యారు…ఇంకా 15 మంది ఉన్నారు వారు ఎల్లుండి డిచార్జ్ అవుతారు.
*రెండో పేజ్ కొరొనా
*255 మంది రేపటితో విదేశాల నుంచి వారు డిచార్జ్ అవుతారు
*9వ తేదీ ఏప్రిల్ లో విదేశాల నుంచి వచ్చిన వారు పూర్తిగా కొలుకుంటారు
*ఇప్పటి వరకు 364మందికి ఇప్పటికి కొరొనా పాజిటివ్ కేసులు నమోదు
*విదేశాల నుంచి వచ్చిన వారు ఇండోనేషియా వారితో కలిపి 45 మంది డిచార్జ్ అయ్యారు.
*గాంధీ హాస్పిటల్ లో 308 మంది చికిత్స పొందుతున్నారు
*11మంది మృతి చెందారు
*నిజాముద్దీన్ కి సంబంధించిన వారిలో 1029 మంది గుర్తించాము
*ఇంకో 35 ఢిల్లీలో ఉన్నట్లు ఉన్నారు
*వెయ్యి నిజాముద్దీన్ కి చెందిన వారిలో 170 మందికి పాజిటివ్..వీళ్ళ ద్వారా మరో 73 మందికి కొరొనా సోకింది
*ఇప్పటి వరకు సోకిన వారిలో ముస్లిం లతో పాటు కొంతమంది హిందువులు ఉన్నారు
*ప్రభుత్వం పట్టుకున్న వారిలో 1వెయ్యి మందికి కొరొనా లేదని తేలింది
*ఇవ్వాళ కూడా 6వందల టెస్టులు చేశారు
*వచ్చే మూడు రోజుల్లో పూర్తి స్థాయి లెక్కలు పూర్తి అవుతాయి
*ఒక రోజు 1వెయ్యి టెస్టుల్లో ఒక్కటి పాజిటివ్ రాలేదు
*ఇప్పటి నుంచి మరో 100 కేసులు నమోదు అయ్యే అవకాశం ఉంది
*లోకల్ గా వ్యాధి సోకితే మన చేతుల్లో ఏమీలేదు
*ఇప్పటికి 22 దేశాలు నెల రోజులు పూర్తిగా లాక్ డౌన్ చేసాయి
*మరో 90 దేశాలు పాక్షికంగా లాక్ డౌన్ డౌన్ చేసాయి
*కొరొనా నివారణకు లాక్ డౌన్ మంచి నిర్ణయం
*ఇండియా ఇవ్వాళ ఈ పరిస్థితి లో ఉన్నాము అంటే లాక్ డౌన్ మాత్రమే
*bosstan(బీసీజీ) సంస్థ జూన్ మొదటి వారం వరకు లాక్ డౌన్ కొనసాగే అవకాశం అని తెలిపింది
*తెలంగాణ కు రోజుకి 440 కోట్ల ఆదాయం రావాలి
*మార్చ్ రెండో వారం నుంచి ఆదాయం నిల్
*ఏప్రిల్ లో 2వేల 4వందల కోట్ల ఆదాయం రావాలి కానీ 4 కోట్లు వచ్చింది
*ఇండియా కు లాక్ డౌన్ తప్ప వేరే మార్గం లేదు
*లాక్ డౌన్ ఎత్తివేత పై అనేక చర్చలు జరుగుతున్నాయి
*విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కొలుకున్నారు
*ఇండోనేషియా నుంచి వచ్చిన వాళ్ళు కొలుకున్నారు
*మార్కాజ్ నుంచి కొరొనా తీవ్రత బాగా వ్యాప్తి చెందింది
*కొరొనా తీవ్రత భారీగా ఉంది
*కొన్ని మరణాలు చికిత్స స్టార్ట్ కాకముందే మృత్యువాత పడుతున్నారు
*లాక్ డౌన్ కొనసాగించాలని మోడీ కి నేను విజ్ఞప్తి చేసాను
*ఒక కుటుంబంలో ఒకరు మృతి చెందితే కుటుంబం రోడ్డున పడుతుంది
*ఇలాంటి పరిస్థితుల్లో మేధావులందరూ ముందుకు వచ్చి ప్రజలకు అండగా ఉండాలి
*మోడీ పిలుపు పై అనేక విమర్శలు చేయడం కరెక్ట్ కాదు
*దీపారాధన అనేది సంఘీభావ సంకేతం అని నేను అందరికి చెప్పాను
*తెలంగాణ ఉద్యమంలో నేను అనేక పిలుపులు ఇచ్చాను
*ప్రధానమంత్రి అంటే ఒక వ్యక్తి కాదు-ఒక వ్యవస్థ
*ప్రధానిని విమర్శలు చేస్తే క్షమించరాని నేరం
*ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వైద్యులకు ధన్యవాదాలు
*ప్రతి ఒక్క వైద్య సిబ్బందికి పాదాభివందనం
*25వేల మందితో వైద్య సిబ్బందితో ఒక ఎక్స్ట్రా ఫూల్ రెడి చేసాము
*18వేల బెడ్స్ ఇప్పటికే సిద్ధం చేసి పెట్టాము
*కోవిడ్-పాజిటివ్ కేసుల కోసం 9 ప్రత్యేక హాస్పిటల్స్ సిద్ధం చేసాము
*ఐసీయూ బెడ్స్ తో ఐసోలేషన్ హాస్పిటల్స్ రెడి చేసాము
*ఎవ్వరికి పాజిటివ్ వచ్చినా గాంధీ లో చికిత్స పొందాలి
*వైద్యులకు ఉన్న జీతాలకు అదనంగా 10శాతం గ్రాస్ సాలరీ ఇస్తున్నాము
*95 వేల 395మంది క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నారు.
*గ్రామాల్లో 45వేల మంది వర్క్ చేస్తున్నారు.
*మొన్న కట్ చేసిన 10 శాతం జీతం తో పాటు 7వేల 500 ప్రత్యేక ghmc&hmws వారికి అదనంగా
*మున్సిపాలిటీ లలో ప్రతి ఒక్కరికి 5వేలు అదనంగా నిధులు ఇస్తున్నాము
*పారిశుద్ధ్య-సపాయి కార్మికుల పాత్ర కీలకమైన పాత్ర పోషిస్తున్నారు
*పారిశుద్ధ్య కార్మికుల కోసం 1వంద కోట్లు రిలీజ్ చేస్తున్నాము.
*పీపీఈ కిట్లు ప్రభుత్వం దగ్గర 40 వేలు ఉన్నాయి.
*5లక్షల కిట్లకు ఇప్పటికే ఆర్థర్ల్ ఇచ్చాము.
*మహిళా సర్పంచ్ లు రోడ్ల పైకి వచ్చి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
*నిజాముద్దీన్ వెళ్లి వచ్చిన వాళ్ళను 99.9 శాతం అందరిని గుర్తించాము.
*జిల్లాలో అనేక మంది శ్రామిస్తున్న వారు ఉన్నారు వారిని సైతం గుర్తిస్తాము.
*లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడిగించాలని ప్రధానిని విజ్ఞపి చేస్తున్నా.
*ఎల్లుండి మోడీతో వీడియో కాన్ఫరెన్స్ లో కేకే-నామా నాగేశ్వరరావు పాల్గొంటారు.
*మోడీ తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేయాలని
*కేంద్రం లాక్ డౌన్ ఎత్తివేసినా నేను పొడిగించేందుకు రెడి గా ఉన్నాను.
*ఫార్మా రవాణా సమస్య లేదు… దేశంలో మందుల కొరత లేదు.
*హైడ్రాక్సిన్ క్లోరోఫామ్ అమెరికా కావాలంటే మోడీ నిరాకరించారు
*సంబంధం లేని వ్యకులకు కొరొనా సోకితే కమ్యూనిటీ ట్రాస్మిషన్ రాలేదు
*7వేల సెంటర్స్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు
*తెలంగాణ భారతదేశ దాన్యాగారం కాబోతోంది
ప్రాజెక్టులు పూర్తయితే వర్షాకాలం పంటల్లోనే 1కోటి 30లక్షల ఎకరాల్లో పంటలు వచ్చే అవకాశం ఉంది.
*గన్ని భ్యాగ్స్ తయారీ కోసం పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము.
*నిజాముద్దీన్ ఘటన లేకుంటే తెలంగాణ ఇప్పటికే కొరొనా ఫ్రీ అయ్యేది.
*ప్రైవేట్ సంస్థలకు జీతాలు ఇవ్వడం లేదని ప్రచారం జరుతుంది-దాని పై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
*రేషన్ కార్డు లేని పేదలకు వంద శాతం రేషన్ ఇచ్చేనందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది