
కరోనా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియాలు చెల్లింపుల దారులకు పెద్ద ఊరట లభించింది. రెన్యువల్స్ గడువును పెంచినట్టు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవెలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్డీఏ) ప్రకటించింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో వాయిదా చెల్లించలేకపోయిన వారు 30 రోజుల లోపు డబ్బు కట్టవచ్చని తెలిపింది. దీంతో మొత్తం 60 రోజుల పాటు ప్రీమియం చెల్లించేందుకు వెసులుబాటు కల్పించింది.ఇన్సూ రెన్స్ కంపెనీలు, లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ రిక్వెస్ట్ మేరకు ప్రీమియం చెల్లింపునకు ఈ 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఇస్తున్నట్టు తెలిపింది. పాలసీలో ప్రీమియం గడువు పొడిగింపు నిబంధన ఉన్నా లేకపోయినా ఈ పొడిగింపు వర్తిస్తుంది. ఆరోగ్య, థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం చెల్లింపు గడువుని IRDAI ఇప్పటికే నెల రోజులు పెంచగా… ఇప్పుడు జీవిత బీమా పాలసీల ప్రీమియం చెల్లింపులకు కూడా వర్తింపజేసింది.