
కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. కరోనా దాదాపు అన్ని ప్రపంచ దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా కోరలు చాచిన కరోనా.. 74,655 మందిని బలి తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 13,46,085 మంది ఈ వైరస్ బారినపడ్డారు. 2,78,534 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
అత్యధికంగా ఇటలీలో 16,532 మంది ప్రాణాలు కోల్పోగా, స్పెయిన్‌లో 13,341 మంది, యూఎస్‌ఏలో 10,871 మంది, ఫ్రాన్స్‌లో 8,911, యూకేలో 5,373 మంది, ఇరాన్‌లో 3,739 మంది, జర్మనీలో 1,810 మంది, బెల్జియంలో 1,632, నెదర్లాండ్స్‌లో 1,867 మంది, టర్కీలో 649, స్విట్జర్లాండ్‌లో 765 మంది మృతి చెందారు.
అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు 3,67,004, స్పెయిన్‌లో 1,36,675, ఇటలీలో 1,32,547, జర్మనీలో 1,03,375, ఫ్రాన్స్‌లో 98,010, ఇరాన్‌లో 60,500, యూకేలో 51,608, టర్కీలో 30,217, స్విట్జర్లాండ్‌లో 21,657, బెల్జియంలో 20,814 కేసులు నమోదు అయ్యాయి.