
లాక్‌డౌన్ పొడిగించాలని పలు రాష్ర్టాల నుంచి కేంద్రానికి వినతలు అందుతున్నాయి. దీనిపై కేంద్రం సమాలోచనలు జరుపుతున్నది. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రధాని మోదీ 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసింది. ఇది ఈ నెల 14తో ముగుస్తున్నది. అయితే కొన్ని రాష్ర్టాలో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతుండటంతో.. లాక్‌డౌన్ ఎత్తివేస్తే పరిస్థితులు మరింత ఆందోళనకరంగా తయారవుతాయని ఆయా ప్రభుత్వాధినేతలు భావిస్తున్నారు. దేశంలో సోమవారం నాటికి 4281 కేసులు నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అసోం, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తెలంగాణలో నమోదైన కేసులు 1367 ఉన్నాయి. అంటే మొత్తం కేసుల్లో ఇది మూడోవంతు. దీంతో ఆయా రాష్ర్టాల్లో లాక్‌డౌన్‌ను కొనసాగించడానికే ప్రభుత్వాలు మొగ్గుచూపుతున్నాయి.