
మహబూబ్‌నగర్‌లో 23 రోజుల చిన్నారికి కరోనా పాజిటివ్ వచ్చిందని జిల్లా కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. మర్కజ్ వెళ్లొచ్చిన వారి ద్వారా కొత్తగా ముగ్గిరికి కరోనా వచ్చిందని వెల్లడించారు. దీంతో నగరంలోని బీకే రెడ్డి కాలనీ, మర్లు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రాంతాల్లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ను గుర్తిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ ప్రాంతాల్లో రసాయనాలు పిచికారి చేశామని, పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తిస్తున్నామని, ఇప్పటివరకు గుర్తించినవారిని క్వారంటైన్ తరలించామని ఆయన తెలిపారు.