
పోలీస్‌శాఖలో మొదటి కరోణ పాజిటివ్ కేసు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ (56)కు కరోనా పాజిటివ్ వచ్చింది. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ చెక్ పోస్ట్ వద్ద ఆయన గత నాలుగు రోజులుగా విధులు నిర్వహిస్తూ అస్వస్థతకు గురయ్యాడు. ఈక్రమంలో వైద్య పరీక్షల నిమిత్తం ఆయన నిమ్స్ ఆసుపత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు గాంధీ కి రిఫర్ చేశారు. శాంపిల్స్ సేకరించి టెస్టులు నిర్వహించిన వైద్యులు.నేడు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఐసోలేషన్ వార్డ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో హెడ్ కానిస్టేబుల్ తో ప్రైమరీ కాంటాక్ట్ అయిన 12 మంది పోలీస్ సిబ్బందిని సైతం క్వారన్ టైన్ సెంటర్ కి తరలించారు. కాగా సదరు హెడ్ కానిస్టేబుల్ ఢిల్లీ లో జరిగిన ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు సమాచారం. ఇంతకు ముందు భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో డిఎస్‌పిగా పని చేసే వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన కుమారుడు లండన్ నుంచి తిరిగి రాగా.. కొడుకు నుంచి సదరు అధికారికి ఇన్ఫెక్షన్ సోకింది. తెలంగాణ పోలీసు విభాగంలో నమోదైన తొలి కేసు ఇదేనని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి.