ఏపీలో 304 కరోనా కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేసే అవకాశం ఉందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  జవహర్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 304 కరోనా కేసులు నమోదయ్యాయని, 260 మందికి పైగా మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారే ఉన్నాయని వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇంటింటి సర్వేలో సుమారు 5వేల మందిని గుర్తించాం. 3లక్షల ర్యాపిడ్‌ టెస్టు కిట్స్‌ ఆర్డర్‌ ఇచ్చాం. 2 లక్షల మందికి టెస్టులు చేయాల్సి ఉంది. 240 మిషన్ల ద్వారా ర్యాపిడ్‌ టెస్టులు చేసే అవకాశం ఉంది.  రోజుకు 3వేల నుంచి 4వేల టెస్టులు చేసే ఛాన్స్‌ ఉంది.  జిల్లాకు ఒక కోవిడ్‌ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో 4 కోవిడ్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేశాం. పాజిటివ్‌ కేసు వచ్చిన ప్రాంతంలో కంటైన్‌మెంట్‌ చేశామని’ ఆయన వెల్లడించారు.