
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయాన్ని ఏప్రిల్ 30 వరకూ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఏప్రిల్ 14 వరకు బుకింగ్ రద్దు చేసిన ఈ సంస్థ దానిని ఈ నెల చివరి వరకు పొడడిస్తున్నట్లు తెలిపింది. భారతీయ రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన ఐఆర్‌సీటీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో లాక్‌డౌన్ పొడిగింపుపై పరోక్ష సంకేతాన్ని ఇచ్చినట్లుందని కొందరు భావిస్తున్నారు. రైల్వే టికెట్ల బుకింగ్స్‌తో పాటు ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ తేజస్ ఎక్స్‌ప్రెస్ పేరుతో మూడు రైళ్లను నడుపుతోంది. వీటిలో ఢిల్లీ నుంచి లక్నో, అహ్మదాబాద్ నుంచి ముంబై మార్గాల్లో ప్రయాణించే రైళ్లు ఉన్నాయి.