మ‌ర్క‌జ్ కు సంబంధించిన‌వే ఏపీలో ఎక్కువ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో నమోదయిన 304 పాజిటివ్ కేసుల్లో 280 ఢిల్లీ  మర్కజ్‌తో సంబంధం ఉన్నవేనని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఎక్కువ శాతం పాజిటివ్ కేసుల్లో మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల్లో వెళ్లివ‌చ్చిన వారు, వారి సంబంధించిన‌వేన‌ని పేర్కొన్నారు. మ‌ర్క‌జ్‌తో లింకు ఉన్న‌వాళ్లంత‌, వారితో ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా  మెలిగిన వారి శాంపిళ్లు సేక‌రించామ‌ని.. దాదాపు 3,500 మంది ఉన్నార‌ని చెప్పారు. ఇక విదేశాల నుంచి వచ్చిన వారు సుమారు 29వేల మంది ఉన్నార‌ని అధికారులు పేర్కొన్నారు. ఇక కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 13 కోవిడ్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.  అటు క‌రోనా నియంత్ర‌ణ‌కు అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు అధికారులు తెలిపారు. 12 వేల పీపీఈలు, 20వేల ఎన్‌-95 మాస్క్‌లు, 40లక్షల గ్లౌజులు, 12 ల‌క్ష‌ల మాస్క్‌లు ఉన్నాయ‌ని.. ఇంకా  20 లక్షల పీపీఈల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు  వివ‌రించారు.