8 గ్రామాల‌ని ద‌త్త‌త తీసుకున్న మోహ‌న్ బాబు

సినీ ప‌రిశ్ర‌మ‌కి చెందిన పేద ప్ర‌జ‌ల‌ని ఆదుకునేందుకు సినీ పెద్దలే స్వయంగా ఛారిటీ ఏర్పాటు చేశారు. దీనికి కొంద‌రు విరాళాలు అందిస్తుండ‌గా, మ‌రి కొంద‌రు  సినీ ప్రముఖులు స్వయంగా పేదవారికి సాయం అందిస్తున్నారు.

తాజాగా మంచు కుటుంబం పేద‌వారి కడుపుకోత తీర్చేందుకు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని 8 గ్రామాలను దత్తత తీసుకుంది. మంచు మోహన్ బాబు తన పెద్ద కుమారుడు మంచు విష్ణుతో కలిసి గ్రామాల్లోని పేద కుటుంబాలకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. రోజుకు రెండు పూటలా ఆహారం పంపిణీ చేస్తున్నారు. లాక్‌డౌన్ ముగిసే వరకు ఇలా ఆహారాన్ని పంపిణీ చేయనున్నారు. ఇది కాకుండా ఎనిమిది టన్నుల కూరగాయలను ఈ గ్రామాల్లోని పేదలందరికీ ఉచితంగా సరఫరా చేస్తున్నారు. సొంత జిల్లా ప్ర‌జ‌ల కోసం మోహ‌న్ బాబు మాస్కులు, శానిటైజర్లను కూడా అందిస్తున్నారు. మ‌రోవైపు మంచు ఫ్యామిలీకి చెందిన మ‌నోజ్  త‌న టీం స‌భ్యుల‌ని తెలుగు రాష్ట్రాల‌కి పంపి పేద వారికి ఆహారం, నీరు స‌ర‌ఫ‌రా చేస్తున్నారు.  మంచు ఫ్యామిలీ దాతృత్వంపై ఆయ‌న అభిమానులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.