
నోవెల్ కరోనా వైరస్ వల్ల అమెరికాలో మంగళవారం ఒక్క రోజే అత్యధికంగా 1736 మంది మరణించారు. దీంతో ఆ దేశంలో వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 12,722కు చేరుకున్నది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఇచ్చిన డేటా ప్రకారం ఈ విషయం వెల్లడైంది. అమెరికాలో ఇప్పటి వరకు 3,98000 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 14 లక్షలు దాటాయి. దేశంలో మరణాల సంఖ్య అత్యధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు ప్రెసిడెంట్ ట్రంప్ కూడా తాజా మీడియా సమావేశంలో వెల్లడించారు. కేవలం న్యూయార్క్‌లోనే మంగళవారం 731 మంది మరణించారు. మరోవైపు చైనాలోని వుహాన్ నగరంలో దాదాపు 11 వారాల క్రితం విధించిన లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేశారు.