ఏపీలో మరో 15 కరోనా కేసులు .. 15 గంటల్లో 15 కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌ను కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తోంది. గంట గంటకు కరోనా పాజిటివ్‌ కేసులు అధికమవుతుండటంతో.. ఏపీ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు కొత్తగా 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు ఏపీ వైద్యాధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 329కి చేరింది. తాజాగా నమోదైన 15 కేసుల్లో.. నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ఆరు కేసుల చొప్పున, చిత్తూరు జిల్లాలో 3 కేసులు నమోదు అయ్యాయి. ఇక ఇప్పటి వరకు ఏపీలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ నుంచి ఆరుగురు కోలుకుని డిశ్చార్జి అయ్యారు.