
కరోనా వల్ల సినీ పరిశ్రమలో ఉపాధి కోల్పోయినవారికి సాయం చేసేందుకు టాలీవుడ్ సినీపరిశ్రమ చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసం ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు ఈ ఛారిటీకి భారీ విరాళాలు అందించారు. కొందరు స్వయంగా పేదల వద్దకి వెళ్లి నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. తాజాగా అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ , ప్రొడ్యూసర్ పద్మావతి గల్లా సి.సి.సికి రూ.10లక్షల విరాళాన్నిఅందిస్తున్నట్టు ప్రకటించారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం తాను ఈ విరాళాన్ని అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ భిన్న తరహా ఎంటర్టైనర్కు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో జగపతిబాబు, నరేష్, సత్యా, అర్చనా సౌందర్య కీలక పాత్రధారులు. ఈ సినిమాకు సంబంధించి 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ నేపథ్యంలో చిత్ర షూటింగ్‌కి తాత్కాలిక బ్రేక పడింది.