ఒకటి, రెండ్రోజుల్లో రూ.1500 బ్యాంకు ఖాతాల్లో వేస్తం: రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

 దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ రేషన్ లబ్ధిదారులకు 12 కిలోల బియ్యం, కుటుంబానికి సర్కార్ రూ. 1500 ఇస్తుందని ప్రకటించారు. ఇప్పటికే ప్రజలు రేషన్ తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఇస్తానన్న డబ్బల కోసం ఎదురుచూస్తున్నారు.  మరో ఒకటి రెండు రోజుల్లో రూ.1500 బ్యాంకు ఖాతాల్లో వేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో 17,200 రేషన్ షాపులున్నాయని చెప్పారు. రేషన్ డీలర్లు గన్నీ బ్యాగ్స్ ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. రేషన్ దుకాణాల నుంచి 60-70 లక్షల గన్నీబ్యాగ్స్ వస్తాయి. తెలంగాణకు 20కోట్ల గన్నీ బ్యాగులు అవసరం ఉందన్నారు. గన్నీబ్యాగులు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారని సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 10కోట్ల గన్నీ బ్యాగులను సమకూర్చుకున్నామన్నారు. పోర్టబిలిటీ ద్వారా ఎక్కడైనా రేషన్ తీసుకొవచ్చిని ఆయన చెప్పారు. ఇప్పటివరకు 71శాతం మందికి రేషన్ బియ్యం అందించామన్నారు.