ఇవాళ రైతు రుణమాఫీపై బ్యాంకర్లతో మంత్రుల చర్చ

ఇవాళ రైతు రుణమాఫీపై బ్యాంకర్లతో మంత్రుల చర్చ
రైతు రుణమాఫీ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వెస్తుంది. రుణమాఫీకి అర్హులైన రైతులు ఎంతమంది ఉన్నారు ? వారు ఎంతరుణం తీసుకున్నారు ? రుణమాఫీని అమలుచేస్తే ఎంత చెల్లించాలి? తదితర అంశాలపై ఇవాళ ప్రభుత్వం ఎస్సెల్బీసీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఆర్థికమంత్రి టి. హరీశ్ రావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆయాశాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొననున్నట్టు తెలిసింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక మరోసారి రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు హామీ ఇచ్చింది.లక్ష రూపాయలలోపు వరకు మాఫీచేస్తానని ప్రకటించింది.ఈసారి కూడా నాలుగు విడుతలు రుణమాఫీ చేస్తామని ప్రకటించినప్పటికీ.. దానిపై స్పష్టత రావాల్సి ఉన్నది. వాస్తవంగా రుణమాఫీ ఎలా అమలుచేయాలన్న దానిపై విధివిధానాల ముసాయిదాను వ్యవసాయశాఖ ఇప్పటికే ఖరారుచేసినట్టు సమాచారం.