
ప్రజల కోసం 24 గంటల హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. సీపీ మీడియాతో మాట్లాడుతూ… ప్రజలు సంప్రదించాల్పిన 24 గంటల హెల్ప్‌లైన్ నంబర్ 040-2343 4343. వాట్సాప్ ద్వారా సంప్రదించాల్సిన నంబర్ 94906 16780. ఈమెయిల్ ఐడీ [email protected]. మెడికల్ ఎమర్జెన్సీ కోసం హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలన్నారు. లాక్డౌన్ సమయంలో అత్యవసర సేవలకు అనుమతి ఉందన్నారు. అత్యవసరాలకు ఇబ్బందులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఆస్పత్రులకు వెళ్లే సమయంలో ఇబ్బంది వస్తే హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి తెలపాలన్నారు.