తెలంగాణ పోలీస్.. శబాస్” తెలంగాణ డిజిపి ప్రతిభ కు గుర్తింపు..

దేశ టాప్ పోలీసుల లిస్టులో..మనసున్న పోలీసు మహేందర్ రెడ్డి
ప్రొఫెసర్ కు పోలీస్ డ్రెస్ వేస్తే..డిజిపి మహేందర్ రెడ్డి..
ఆయన పైకి చూస్తే.. ఐపిఎస్ అధికారి..తెలంగాణ రాష్ట్రానికి పోలీస్ బాస్. డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్…కానీ లోపల వో ప్రొఫెసర్. ఇంకా చెప్పాలంటే వో సోషియాలజీ ప్రొఫెసర్ తనలో దాగి వుంటడు.
వ్యక్తుల ప్రవర్తనను,వారిలోని నేర ప్రవ్రుత్తిని, వారి వారి మానసిక కోణంలోనే కాకుండా.. వారి మీద ప్రభావం చూపే సామాజిక పరిస్థితుల కోణంలో కూడా పరిశీలించి అర్థం చేసుకోగలిగే నైపుణ్యం తన సొంతం. ఎంత సౌమ్యంగా కనిపిస్తూ ఆప్యాయంగా పలకరిస్తారో అంతే నిష్టతో తన వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తుంటరు.సూటు బూటు వేసుకోని కార్లల్లో వస్తేనే సార్ అని పిలుస్తున్న వర్తమాన, మానసిక సామాజిక పరిస్థితుల్లో….వర్గ కుల మత ప్రాంత బేధాలు లేకుండా ‘‘ఎవ్వరినైనా మనం సర్ ‘ అని సంబోధించాల్సిందే.. ఎవరి పన్నులనుంచి మనం మన జీతాన్ని తీసుకుని మన కుటుంబాన్ని పోశిస్తున్నమో అటువంటి ప్రతి పౌరుడూ మనకు సారే..ఇకనుంచి ప్రతి వొక్కరినీ సార్ అని పిలవాల్సిందే‘‘..నని తన డిపార్ట్ మెంట్ పోలీసులకు స్పష్టం చేసిన మానవీయ పోలీసు ఉన్నతాధికారి తను. ఇటువంటి సామాజిక ధృక్పధం కలిగిన పోలీసు అధికారిని మనం ఎవరినన్నా చూసినమా లేదో ఇప్పటివరకు.. కానీ అటువంటి సామాజిక సోయి బాధ్యత నిలువెత్తుగా వున్న పోలీసు ఉన్నతాధికారి మన తెలంగాణ బిడ్డ అని సగర్వంగా చెప్పుకుంటున్నది నేడు తెలంగాణ సమాజం.పోలీసు అనంగనే.. అధికారం అని సమాజం భావిస్తుంటది. కానీ అంతకంటే తమకున్న సామాజిక బాధ్యతే గొప్పది అని భావించే గొప్ప కార్యాచరణ డిజిపి సొంతం. వృత్తిరీత్యా పోలీసు అంటే దండోపాయమే కాదు.. అంతకు ముందు సామదానభేదోపాయాలను కూడా ప్రయోగించి మనుషులను మార్చాలనే ఎరుక..తన సొంతం. మనిషిలో మార్పు అనేది వ్యక్తిగతంగానే కాకుండా సామాజికంగా సాగాలె అనె సామాజిక విధానాన్ని పుణికిపుచ్చుకున్న తెలంగాణ తాత్విక విధానం..తన వొంట్లో ప్రవహిస్తుంటది. సహచర అధికారుల పట్ల ప్రభుత్వ పెద్దల పట్ల నమ్రత, ప్రజల పట్ల ప్రేమ ఆప్యాయత, నేరస్థుల పట్ల సహనం శాంతం వో తండ్రిలాగా చక్కదిద్దే అవగాహన మొత్తంగా పోలీసంటే ఇట్లుండాలె అన్నట్టు.. వో సామాజిక పోలీసు డిజిపీ మహేందర్ రెడ్డి లో కనిపిస్తుంటరు.మరి అటువంటి డిజిపి మహేందర్ రెడ్డి..దేశంలోనే 25 టాప్ ఐపిఎస్ అధికారుల్లో వొకరుగా గుర్తింపు పొందడమంటె అది తెలంగాణకే గర్వకారణం. ఖమ్మం జిల్లా బిడ్డగా.. తన అపాయింట్ మెంట్ నుంచి పోలీసు అధికారిగా అంచలంచలుగా ఎదుగుతూ..డిజిపి కనబరిచిన ప్రతిభకు కఠోర శ్రమకు దక్కిన గుర్తింపు. దాంతోపాటు తెలంగాణ పోలీసుల పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ చూపుతున్న ఆదరణకు ప్రతిఫలణమీ గుర్తింపు.ముఖ్యంగా కరోనా వంటి ప్రమాదకర పరిస్తితుల్లో…తెలంగాణ సమాజం పై ఆపార కరుణ జూపుతూ.. ప్రజల ప్రాణాలను తన ప్రాణాలను అడ్డమేసి కాపాడుతున్న…మనసూ మానవత్వమున్న ప్రతి పోలీసుకు దక్కిన అరుదైన ఈ గౌరవం మనందరికీ వో గర్వకారణం.
పూర్తి వివరాలు……
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి అరుదైన ఘనత…దేశంలోనే టాప్ 8 వ స్థానం…86 బ్యాచ్ లో నెంబర్ వన్ స్థానం.
ఫేమ్ ఇండియా, ఆసియా పోస్ట్ , పిఎస్‌యు వాచ్ అనే మూడు సంస్థలు దేశవ్యాప్త సర్వేలో పాల్గొని దేశంలోని టాప్ పోలీస్ అధికారుల లిస్టును తయారు చేయగా, అందులో డీజీపీ మహేందర్ రెడ్డి 8వ స్థానంలో నిలిచారు…. వివరాల్లోకి వెలితే….దేశంలోని టాప్ 25 ఐపిఎస్ అధికారుల జాబితాలో తెలంగాణ డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి ఎంపికయ్యారు. ఫేమ్ ఇండియా, ఆసియా పోస్ట్ , పిఎస్‌యు వాచ్ అనే మూడు సంస్థలు దేశవ్యాప్త సర్వేలో పాల్గొని దేశంలోని టాప్ పోలీస్ అధికారుల లిస్టును తయారు చేయగా, అందులో డీజీపీ మహేందర్ రెడ్డి 8వ స్థానంలో నిలిచారు.
పోలీసు సేవలో పనితీరు ద్వారా కొత్త తరానికి బెంచ్‌మార్క్‌ సృష్టించిన టాప్ 25 ఐపిఎస్ అధికారులను పీఎస్‌యూ వాచ్ సంస్థ గుర్తించింది. దాదాపు 4000 మంది అధికారుల జాబితాలో టాప్ 25 ఐపిఎస్ అధికారులను జరిగినట్లు ప్యానెల్ పేర్కొంది. ముఖ్యంగా సదరు పోలీసు అధికారుల అంతర్గత నివేదికలు, మీడియా నివేదికలు, నిర్దిష్ట జిల్లాలో వారి మొదటి పోస్టింగ్ ప్రస్తుత హోదా వరకు కొలమానంగా ఈ సర్వే జరిగింది.
ఫేమ్ ఇండియా మ్యాగజైన్ ఎడిటోరియల్ డైరెక్టర్, యుఎస్ సోంతాలియా మాట్లాడుతూ…‘‘ఇంతకు ముందు 100 మంది ఐపిఎస్ అధికారులను షార్ట్‌లిస్ట్ చేయాలని మేము భావించాము, కాని అప్పుడు మేము జాబితాను 200 కన్నా తక్కువకు తగ్గించలేము. ఈ సమర్థవంతమైన 200 సూపర్ పోలీసులలో చివరి 25 మంది. కాబట్టి మేము ఆ 200 మందిని 25 వేర్వేరు వర్గాలుగా వర్గీకరించి, తుది జాబితా కోసం ప్రతి వర్గం నుండి ఉన్నతాధికారిని ఎన్నుకున్నామని తెలిపారు. పిఎస్‌యు వాచ్ మేనేజింగ్ ఎడిటర్ వివేక్ శుక్లా మాట్లాడుతూ… ఒక ఐపిఎస్ అధికారి పాత్ర సాధారణ శాంతిభద్రతల నిర్వహణకు మాత్రమే పరిమితం కాదని, వారు నక్సలిజం, ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలు, మాదకద్రవ్యాలు, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన అనేక విచిత్రమైన సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉందని పేర్కొన్నారు.
అంతేకాదు నిజాయితీ, నిష్పాక్షపాతం, సమర్థవంతంగా నియంత్రించే సామర్థ్యం, ​​మొత్తం శాంతిభద్రతల పరిస్థితిని మెరుగుపరిచే సమర్థత, ​​ప్రజలతో వ్యవహరించడంలో స్నేహపూర్వకంగా మెలగడం, దూరదృష్టితో, బాధ్యతాయుతంగా ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకోవడం ఆదారంగా ఈ జాబితాను తయారు చేసినట్లు తెలిపారు.
సోర్స్: Ramesh Hazari గారు (కర్టసీ.. న్యూస్ 18)