
దేశవ్యాప్తంగా 5,908 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 183 మంది మృత్యువాత పడ్డారు. కరోనా నుంచి కోలుకుని 507 మంది డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ర్టాలో అత్యధికంగా 1135, తమిళనాడులో 738 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8 మంది మృతి చెందారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 669కి చేరుకుంది. ఢిల్లీలో 20 హాట్స్పాట్లను మూసివేసినట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.
మధ్యప్రదేశ్లో కరోనా కేసులు 385కి చేరుకోగా, 23 మంది మృతి చెందారు. రాజస్థాన్లో 363 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్లో 361కి చేరుకోగా, 26 మంది బాధితులు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. కేరళలో బాధితుల సంఖ్య 345కి చేరుకోగా, చికిత్స అంనంతరం 84 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు.