
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. యూనైటెడ్ స్టేట్స్, యూనైటెడ్ కింగ్‌డమ్‌లు అత్యధిక మరణాలతో తీవ్ర వేదనకు గురౌతున్నాయి. కాగా దక్షిణ కొరియా, న్యూజిలాండ్ వంటి దేశాలు లాక్‌డౌన్, టెస్టింగ్, మానిటరింగ్, క్వారంటైన్ వంటి చర్యలతో కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థంగా నిలువరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 15 లక్షల 18 వేల 970. కోవిడ్-19 వ్యాధి కారణంగా 88 వేల 516 మంది చనిపోయారు. వ్యాధి భారి నుంచి ఇప్పటివరకు 3 లక్షల 30 వేల 697 మంది కోలుకున్నారు. కోవిడ్-19 కారణంగా అత్యధికంగా ఇటలీలో ఇప్పటి వరకు 17,669 మంది చనిపోయారు. అదేవిధంగా యూఎస్‌ఏలో 14,795, స్పెయిన్‌లో 14,792, జర్మనీ-2,349, ఫ్రాన్స్‌లో 10,869, చైనాలో 3,335, ఇరాన్‌లో 3,993, యూకేలో 7,097, బెల్జియంలో 2,240, నెదర్లాండ్స్‌లో 2,248 మంది మృత్యువాతపడ్డారు.