
కరోనాపై చేస్తున్న యుద్ధంలో భాగమైన వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులపై ప్రశంసలు కురిపిస్తూ పలువురు ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య తెలంగాణ పోలీసుల కృషిని ప్రశంసిస్తూ నిన్న ట్వీట్ చేయగా, తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా తెలంగాణ పోలీసులకి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కోవిడ్ 19కి వ్యతిరేఖంగా తెలంగాణ పోలీసులు చేస్తున్న యుద్ధానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి కృషి అసాధారణమైనది .ఇలాంటి విపత్కర పరిస్థితులలో మన జీవితాలని, కుటుంబాల ఆరోగ్యాన్ని కాపాడుతున్న పోలీసులకి కృతజ్ఞతలు. ప్రజల కోసం,దేశం కోసం నిస్వార్ధంగా ఎంతో అంకిత భావంతో మీరు చేస్తున్న కృషికి సెల్యూట్ చేస్తున్నాను అని మహేష్ పేర్కొన్నారు.