
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో లలిత కళాపీఠం నిర్వహిస్తున్న మ్యాజిక్ సర్టిఫికెట్ కోర్సులో చేరడానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఈనెల 31 వరకు స్వీకరిస్తున్నట్లు డైరెక్టర్ సామల వేణు తెలిపారు. ఈ కోర్సులో చేరికకు 10వ తరగతి ఉత్తీర్ణులై 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 5 బ్యాచులను విజయవంతంగా నిర్వహించామన్నారు. ఆసక్తి గల యువతీ యువకులు 2019 -2020 విద్యాసంవత్సరానికి గాను మ్యాజిక్ కోర్సులో చేరడానికి పూర్తి వివరాలకు 905979 4553, 9246350156 నంబర్లను సంప్రదించవచ్చని ఆయన కోరారు.