
దేవరకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన పిడుగు పడిన ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఫోన్లో మాట్లాడి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పిడుగు పడినప్పటికీ కూడా తమకు ఎలాంటి హాని జరగలేదని తాను తన కుటుంబ సభ్యులు, తన సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని ఎమ్మెల్యే , మంత్రి కేటీఆర్ కి తెలియజేశారు. ప్రమాదం జరిగినప్పటికీ ఎలాంటి నష్టం జరగకపోవడంతో మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.