ఈరోజు నుంచి మొదలుకానున్న 33వ జాతీయ పుస్తక ప్రదర్శన

పుస్తక ప్రదర్శన ఏర్పాట్లను పర్యావేక్షించిన తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ట, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు, రచయిత జూలూరి గౌరీ శంకర్

ఈరోజు నుంచి హైదరాబాద్ నగరంలో జాతీయ పుస్తక ప్రదర్శన మొదలవుతున్నది. దీని కోసం వివిధ, రాష్ట్రాలు, జిల్లాల నుంచి కవులు, రచయితలు, పబ్లిషర్స్, సాహితీవేత్తలు, కళా పిపాసులు వస్తున్నారు. ముఖ్యమంగా దేశ వ్యాప్తంగా ఉన్న సాహితీవేత్తలను పది రోజుల పాటు పుస్తక జాతర కనువిందు చేయనున్నది.
ఎన్టీఆర్ స్టేడియం – ఇందిరా పార్కు (తెలంగాణ కళా భారతి ప్రాంగణం) లో ఈ నెల 23వ తేదీ నుంచి జనవరి (2020) 1వ తేదీ వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పుస్తక ప్రదర్శన జరుగుతుంది. 33వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సోమవారం ఆవిష్కరించనున్నారు. దేశ ప్రధానిగా చేసిన బహు భాషా కోవిదులు డా.పీవీ నర్సింహారావు పేరిట ప్రత్యేక ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు.
330 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు
33వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన 2019లో మొత్తం 330 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. దీనికోసం దాదాపు 9 రాష్ట్రాల నుంచి పబ్లిషర్స్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పబ్లిషర్స్ ఎక్కువగా స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ పుస్తక ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటది అని చెప్పవచ్చు.