తెలంగాణలో కొత్తగా 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 487కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 45 మంది కోలుకున్నారు. 430 మంది కరోనా బాధితులు ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌పై ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌ సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహించి సూచనలు చేస్తున్నారు.