సమ్మక్క బరాజ్‌కు అటవీ భూమి

గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన సమ్మక్క బరాజ్‌కు అటవీ భూమి బదలాయింపునకు కేంద్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు పచ్చజెండా ఊపింది. 26 హెక్టార్ల అటవీభూమిని ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం అభయారణ్యం కింద ఉన్న భూమిని బరాజ్‌ నిర్మాణానికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అధ్యక్షతన గురువారం జరిగిన ఆన్‌లైన్‌ సమావేశంలో రాష్ర్టానికి చెందిన రెండు ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారు. సమ్మక్క బరాజ్‌తో పాటు కాగజ్‌నగర్‌ రైల్వే మూడో బ్రాడ్‌గేజ్‌ లైన్‌ ఏర్పాటుకు కూడా వైల్డ్‌లైఫ్‌ బోర్డు అనుమతినిచ్చింది.