
లాక్‌డౌన్‌తో ఇండ్లకు పరిమితమైన గిరిజన గురుకులాల విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన కోసం ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) ఆధ్వర్యంలో ఓక్స్ (ఆన్‌లైన్ అడాప్టెడ్ నాలెడ్జ్ సిస్టం) పేరిట విద్యాయాప్‌ను ప్రారంభించారు. ఎస్టీ గురుకులాల్లోని 6 నుంచి 9 తరగతుల విద్యార్థులు గణితం, జీవశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, ఇతర విషయాలను ఇంటినుంచి నేర్చుకొనేందుకు ఈ యాప్‌ను వినియోగించాలని టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.