
మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను పకడ్బందీగా అమలు చేస్తోంది. తాజాగా కరోనా నివారణకు కేంద్రం చేసిన మరో సూచన అమల్లోకి తీసుకొచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధించింది. ఉమ్మివేయడం, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తులు నమిలి పడేయడంపై నిషేధం విధిస్తూ.. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఐపీసీ 1860, సీఆర్పీసీ చట్టం ప్రకారం శిక్ష విధించేలా ఉత్తర్వులు జారీ చేసింది.