
కరోనా వైరస్‌కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నవారిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు 60 కేసులు నమోదు చేశారు. గతంలో జరిగిన పాత చిత్రాలు, వీడియోలను జోడించి అసత్య ప్రచారాలతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్లున్న, నకిలీ పోస్టులు పోస్టులు సృష్టించి వైరల్ చేస్తున్నవారిని గుర్తించి వారిపై కేసులు నమోదుచేస్తున్నారు. గత పదిరోజుల్లో చిత్తూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఇలాంటి కేసులు అధికంగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పౌరులకు వచ్చే సందేహాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ట్విటర్ ద్వారా వివరణ ఇస్తున్నారు.